ఆకాశంలో ఒక తార.. రాధే రాధే పాట పాడిన దుల్కర్ సల్మాన్ – స్పెషల్ వీడియో రిలీజ్

Dulquer Salmaan Sings Radhe Radhe from Aakasamlo Oka Tara

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పోస్టర్లతో ఆసక్తిని పెంచిన మేకర్స్.. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘రాధే రాధే’ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది.  

తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, హీరో దుల్కర్ సల్మాన్ కలిసి ‘రాధే రాధే’ పాటను ఆలపిస్తూ సందడి చేశారు.

ఈ సందర్భంగా పాటను రూపొందించిన తీరు, దాని వెనుక ఉన్న భావోద్వేగాలను పంచుకున్నారు. కేవలం పాట మాత్రమే కాకుండా, ‘ఆకాశంలో ఒక తార’ సినిమా వెనుక ఉన్న ఎమోషనల్, సోల్‌ఫుల్ జర్నీని కూడా ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.

దుల్కర్ సల్మాన్, జీవీ ప్రకాష్ కలిసి పాట పాడిన తీరు, పాట వెనుక ఉన్న భావోద్వేగాలు ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఈ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే హిట్‌గా నిలిచిన ‘రాధే రాధే’ పాటకు సంబంధించిన ఈ వీడియో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్.

‘ఆకాశంలో ఒక తార’ చిత్రం 2026 నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.