యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. పొట్టేల్ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చీఫ్ గెస్ట్‌గా హాజరవగా మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా యాక్టర్ అజయ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. థిస్ ఫిలిం వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే విక్రమార్కుడు తర్వాత మళ్లీ అలాంటి ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ చేయగలుగుతానా లేదా అనిపించేది. థాంక్యూ సాహిత్ రైటింగ్ థిస్ రోల్. యూనిట్ అంతా తీవ్రమైన ఎండలో దాదాపు 60 రోజులు ఒక విలేజ్‌లో షూట్ చేశారు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సాహిత్ చాలా పెద్ద డైరెక్టర్ కాబోతున్నాడు. తనకి సినిమా మీద ఉన్న కన్వెన్షన్, తను తీసిన ఎమోషనల్ సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎడ్యుకేషన్ అనేది ఒక వెపన్. దానిమీద సినిమా తీసినప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అవుతుందేమో అని ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో కొన్ని సీన్స్‌కి విజల్స్ కొడతారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అంత ఎక్స్‌ట్రార్డినరీగా కుదిరాయి” అని చెప్పారు.
అలాగే “ఈ సినిమాలో పనిచేసిన అందరూ చాలా సూపర్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాలో చిన్న పాప సరస్వతి క్యారెక్టర్ చేసింది. తను ఈ సినిమాకి సోల్. సందీప్ గారు ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్స్ సురేష్, నిశాంక్ గారు చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేశారు. సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్యూ సో మచ్” అని అన్నారు నటుడు అజయ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























