ఆ నీచులను వదిలిపెట్టను … చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం

Jr NTR Expresses Anger Over AI-Morphed Chuttamalle Video

‘దేవర’ చిత్రంలోని ఆల్‌‌టైమ్ చార్ట్‌బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే” ఏఐ మార్ఫింగ్ వీడియోపై ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హీరోయిన్ జాన్వీ కపూర్ మరియు తన విజువల్స్‌ను అసభ్యకరంగా డిజిటల్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంపై ఆయన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయమై ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రమైన పదజాలంతో స్పందించారు. “స్త్రీలను తల్లిగా, దేవతగా పూజించే ఈ నేలలో ‘మాతృదేవోభవ’ అనేది కేవలం మాట మాత్రమే కాదు, మన సంస్కృతిలో భాగం. అలాంటిది ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఒక మహిళను అత్యంత నీచంగా చూపించే స్థాయికి దిగజారడం అత్యంత హేయం, అసహ్యకరం” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

అలాగే ఈ కంటెంట్‌ను తయారు చేసిన వారికి మరియు సర్క్యులేట్ చేస్తున్న వారికి గట్టి హెచ్చరిక జారీ చేశారు: “ఈ మార్ఫింగ్ వీడియో వెనుక ఉన్న నీచాతి నీచులను ఎవరినీ ఉపేక్షించేది లేదు. తయారు చేసిన వారిపై, షేర్ చేస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.”

నెటిజన్లు ఎవరూ కూడా ఈ తరహా అసభ్యకర కంటెంట్‌ను చూడవద్దని, షేర్ చేయవద్దని మనవి చేశారు. “ఈ రోజు ఒకరికి జరిగింది.. రేపు అది మీ ఇంట్లోని తల్లికి, చెల్లికి, భార్యకు లేదా కూతురికి జరగొచ్చు” అని హెచ్చరించారు. అంతేకాకుండా, కృత్రిమ మేధస్సు (AI) దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు మరియు నిబంధనలు తీసకురావాలని ఎన్టీఆర్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై కథానాయిక జాన్వీ కపూర్ కూడా స్పందిస్తూ చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.