తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొన్ని రోజుల క్రితం స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్ సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా.. ఇప్పటివరకూ విడుదలైన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. పొట్టేల్ సినిమా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దీంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచిన మేకర్స్ రీసెంట్‌గా మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్‌ని కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చీఫ్ గెస్ట్‌గా హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా పొట్టేల్ నుంచి కీలక అప్‌డేట్ అందింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది ఈ చిత్రం.
సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ అందించింది. దీంతో మూవీ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ క్రమంలో రేపటినుంచి పొట్టేల్ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు మేకర్స్. బుధవారం, గురువారం రెండు రోజులపాటు పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో మూవీ టికెట్స్ అందుబాటులో ఉంచారు. ఈమేరకు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.
కాగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే పొట్టేల్ చిత్రాన్ని నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























