బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, దర్శకుడు అభిషేక్ పాఠక్ కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. గాంధీ జయంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే ఏకంగా ఇండియాలో రూ. 62 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్తుపోయేలా చేసింది. ఈ అద్భుతమైన ప్రారంభంతో మొదటి వీకెండ్లోనే రూ.200 కోట్లకు పైగా రాబట్టే దిశగా దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజయ్ దేవగన్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్: గతంలో ‘సింగం అగైన్’ (₹43.70 కోట్లు) పేరిట ఉన్న రికార్డును భారీ తేడాతో అధిగమించి అజయ్ దేవగన్ కెరీర్లోనే అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది.
గాంధీ జయంతి ఆల్‌టైమ్ రికార్డు: అక్టోబర్ 2న అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘వార్’ (₹51.60 కోట్లు) రికార్డును తుడిచిపెట్టేసింది.
ఫ్రాంచైజ్ రికార్డు: 2015లో ‘దృశ్యం’ (₹8.05 కోట్లు), 2022లో ‘దృశ్యం 2’ (₹15.38 కోట్లు) వసూలు చేయగా.. మూడో భాగం ₹62 కోట్లతో డబుల్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
2026 టాప్ ఓపెనర్స్: 2026 సంవత్సరంలో వచ్చిన అతిపెద్ద ఓపెనర్లలో ‘ధురంధర్ 2’ తర్వాత రెండవ స్థానంలో నిలవగా, ‘బోర్డర్ 2’ మూడో స్థానానికి పడిపోయింది.
ఓవరాల్ గా దృశ్యం 3 మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా 90కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ నుంచి వస్తున్న యూనానిమస్ పాజిటివ్ టాక్, వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే శని, ఆదివారాల్లో ఈ చిత్రం మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























