రీ రిలీజ్ కానున్న మణిరత్నం – నాగార్జున మోస్ట్ ఐకానిక్ రొమాంటిక్ డ్రామా గీతాంజలి

Nagarjuna’s Classic Romantic Drama Geethanjali Gets a Re-Release Date

అక్కినేని నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లాసిక్స్ మరియు తెలుగు సినీ చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఐకానిక్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం అద్భుత దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఈ చిత్రాన్ని డిజిటల్ 4K వర్షన్‌తో రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం, ప్రియదర్శిని కాంబినేషన్ విజువల్స్ మరియు మ్యూజిక్ మాంత్రికుడు ఇళయరాజా అందించిన చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఇప్పటికీ సినీప్రియులను మైమరపిస్తుంటాయి. ‘జగడ జగడ జాం’, ‘ఓ పాపా లాలీ’, ‘ఓ ప్రియా ప్రియా’ వంటి పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న రీ-రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా, ఈ ఆల్‌టైమ్ క్లాసిక్ కల్ట్ రొమాంటిక్ డ్రామాను సరికొత్త శబ్ద, దృశ్య నాణ్యతతో రీ-రిలీజ్ చేస్తుండటంతో అక్కినేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 13న రీ-రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.