మెగా హీరో వరుణ్ తేజ్,పలాస ఫేమ్ కరుణ కుమార్ కాంబోలో వస్తున్న చిత్రం మట్కా.1980 బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది.ఇందులో వరుణ్ మట్కా కింగ్ వాసు పాత్రలో కనిపించనున్నాడు.షూటింగ్ కూడా తుదిదశకు చేరుకుంది.రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ తస్సాదియ్యా రానుంది.ఈనెల 24న ఈ సాంగ్ విడుదలకానుంది. ఈ సందర్బంగా సాంగ్ లోని వరుణ్ తేజ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.మట్కా లో మీనాక్షి చౌదరి,నోరా ఫతేహి హీరోయిన్లు గా నటిస్తుండగా నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.వైరా ఎంటర్టైన్మెంట్స్,ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.నవంబర్ 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇదిలావుంటే ఈసినిమా విజయం వరుణ్ తేజ్ కు తప్పనిసరి కానుంది.గద్దల కొండ గణేష్ తరువాత సోలో హీరోగా ఇంతవరకు అతనికి ఆ రేంజ్ హిట్ పడలేదు.ఈ ఏడాది మార్చి లో ఆపరేషన్ వాలెంటైన్ అంటూ వచ్చినా ఆ సినిమా కూడా నిరాశను మిగిల్చింది.దాంతో వరుణ్,మట్కాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.మరి ఈసినిమాతో వరుణ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























