ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు స్టార్ట్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.మాములుగా ఇప్పుడున్న స్టార్ హీరోలు ఒక్క సినిమా చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు కానీ ప్రభాస్ మాత్రం రెస్ట్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఏడాదికి రెండు రిలీజ్ లకు తగ్గకుండా చూసుకుంటున్నాడు.ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమా రీసెంట్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీతారామం ఫేమ్ హను రాఘవపూడి ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.ఈసినిమా షూటింగ్ వచ్చేవారం నుండి స్టార్ట్ కానుందని సమాచారం.తమిళనాడు లోని కరైకుడి లో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది.ఇందులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈసినిమా 1940 బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది.ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటించనుండగా మిథున్ చక్రవర్తి,జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మిస్తున్నాయి.విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది చివర్లో విడుదలచేయనున్నారు.
ఇక ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చేస్తున్నాడు.హైదరాబాద్ లోవేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగుతుంది.ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తోపాటు ముగ్గురు హీరోయిన్ల పై కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మారుతి డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదలకానుంది.ఇవే కాకుండా ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ ,ప్రశాంత్ నీల్ తో సలార్ 2 ,నాగ్ అశ్విన్ తో కల్కి 2 వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























