బుల్లితెరపై మరియు డిజిటల్ స్పేస్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ సంచలనం సృష్టిస్తున్న లేటెస్ట్ రియాలిటీ షో ‘ది ట్రెయిటర్స్ తెలుగు’. మైండ్ గేమ్స్, టాస్క్‌లు మరియు ఉత్కంఠభరితమైన ఎలిమినేషన్లతో సాగుతున్న ఈ షోలో ప్రముఖ డిజైనర్, కంటెంట్ క్రియేటర్ శ్రావ్య వర్మ తనదైన గేమ్‌ప్లేతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మైండ్ బ్లాకింగ్ గేమ్‌ప్లే మరియు సమయస్ఫూర్తితో ఆమె ఆట తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షో ఆరంభం నుంచే ప్రతి టాస్క్‌ను ఎంతో క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ, సహచర కంటెస్టెంట్లతో ఎంతో హుందాగా మసలుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు శ్రావ్య వర్మ. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎంతో ఒత్తిడిని తట్టుకుని, సమయానుకూలంగా సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఆమె ఆడుతున్న తీరుకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె డెసిషన్ మేకింగ్ స్కిల్స్ మరియు గేమింగ్ స్ట్రాటజీలు నెటిజన్లను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
ప్రేక్షకుల నుంచి వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ చూస్తుంటే శ్రావ్య వర్మ ఈ షోలో విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. బిగ్ స్క్రీన్ స్థాయిలో టాక్ సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తున్న శ్రావ్య వర్మ, రాబోయే ఎపిసోడ్లలో మరింత పవర్‌ఫుల్ గేమ్‌ప్లేతో ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























