వర్సటైల్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘బత్తా’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ తాజాగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న వరల్డ్‌వైడ్‌గా స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం సహా ఐదు ప్రముఖ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో విభిన్న ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. విజయ్ సేతుపతితో పాటు మాస్టర్ సాయి పృథ్వీరాజ్, లిజోమోల్ జోస్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రముఖ నిర్మాతలు మురాద్ ఖేతాని, అట్లీ, ప్రియా అట్లీ, అలోక్ జైన్, అజిత్ అంధారే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























