టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ ఒక సరికొత్త సంచలనానికి తెరలేపుతున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరంజీవిస్ మెగావర్స్ కు చిరం హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు అధికారక ప్రకటన వచ్చేసింది. ఈ క్రేజీ టాక్ షో ‘చిరంజీవిస్ మెగావర్స్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మాస్‌కి గ్రామర్, స్టైల్‌కి డెఫినిషన్.. మెగాస్టార్ ఈజ్ హియర్” అంటూ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక రాజసాన్ని తలపించేలా ఉన్న ఈ వేదికపై మెగాస్టార్ తనదైన శైలిలో ఇంటరాక్ట్ అవుతూ, సెలబ్రిటీలతో ముచ్చటించబోతున్న ఈ షో డిజిటల్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.
సినిమాలతోనే కాకుండా ఓటీటీ మాధ్యమంలోనూ ప్రేక్షకులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పంచడానికి మెగాస్టార్ సిద్ధమవుతుండటంతో మెగా అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న ఈ ‘మెగావర్స్’ విశేషాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























