ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న విపత్కర పరిస్థుతుల నేపథ్యంలో వరద బాధితులకు అండగా తమ వంతు సాయం అందించడానికి సినిమా పరిశ్రమ ముందుకొస్తుంది.అందులో భాగంగా హీరోలు భారీగా విరాళాలను ప్రకటిస్తున్నారు.మొదటగా ఎన్టీఆర్ స్పందించి తన వంతుగా రెండు రాష్ట్రాలకు కోటి విరాళం ప్రకటించగా ఆతరువాత మెగాస్టార్ చిరంజీవి,బాలకృష్ణ,మహేష్ బాబు,అల్లు అర్జున్,సిద్దు జొన్నలగడ్డ ,విశ్వక్ సేన్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు.ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలకు కోటి చొప్పున విరాళం ప్రకటించాడు.అలాగే రామ్ చరణ్ రెండు రాష్ట్రాలకు 50లక్షల చొప్పున కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఇక ఇప్పటివరకు అత్యధికంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 6కోట్ల విరాళం ప్రకటించారు.అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించనున్నారు.అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నందున,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు.. ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: