కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఆంధ్రప్రదేశ్‌లో ఆదర్శకుటుంబం టికెట్ ధరల పెంపు

Adarsha Kutumbam Ticket Prices Hiked in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో ఆదర్శకుటుంబం టికెట్ ధరల పెంపు

Adarsha Kutumbam Ticket Prices Hiked in Andhra Pradesh

Adarsha Kutumbam Ticket Prices Hiked in Andhra Pradesh

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (House No. 47) సినిమా విడుదల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర యూనిట్‌కు అదిరిపోయే తీపి కబురు అందించింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ జీవో ప్రకారం, అక్టోబర్ 30న సినిమా విడుదలయ్యే రోజు నుంచి నవంబర్ 8 వరకు (మొత్తం 10 రోజుల పాటు) రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవడానికి సర్కార్ వెసులుబాటు కల్పించింది. పెంచిన టికెట్ రేట్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

మల్టీప్లెక్స్‌లు: ప్రతి టికెట్‌పై రూ. 75 (జిఎస్టీతో కలిపి) అదనంగా పెంచుకోవడానికి పర్మిషన్ లభించింది. దీంతో పెరిగిన టికెట్ ధర రూ. 252గా ఉండనుంది.

సింగిల్ స్క్రీన్‌లు: సాధారణ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ. 50 మేర పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో సింగిల్ స్క్రీన్‌లలో పెరిగిన టికెట్ రేటు రూ. 197.50గా నిర్ణయించబడింది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా, తమన్ స్వరాలు అందించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం, ఏపీ ప్రభుత్వ టికెట్ పెంపు జీవోతో బాక్సాఫీస్ వద్ద తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్