ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతున్న లేటెస్ట్ రియాలిటీ షో ది ట్రెయిటర్స్ తెలుగుకి విశేష స్పందన లభిస్తుంది. ఇక ఈ షోలో డిజైనర్ శ్రావ్య వర్మ కనబరుస్తున్న అసాధారణ ప్రదర్శన ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ప్రతి ఎపిసోడ్‌లోనూ తన చాకచక్యంతో, తెలివైన నిర్ణయాలతో ఆమె ఆడుతున్న తీరు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షోలో ఎదురయ్యే సంక్లిష్టమైన సవాళ్లను మరియు మైండ్ గేమ్స్‌ను శ్రావ్య వర్మ ఎదుర్కొంటున్న విధానం ఆమెలోని పరిణతిని చాటిచెబుతోంది. ఎదుటివారి వ్యూహాలను ముందుగానే అంచనా వేస్తూ, మైండ్ గేమ్‌ను ఎంతో ప్రశాంతంగా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆమె దిట్టగా నిరూపించుకుంటున్నారు. ఎక్కడా సహనం కోల్పోకుండా, ఎంతో హుందాగా మరియు తెలివితో ముందుకు సాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
ఆమె పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా నెటిజన్లతో పాటు సెలబ్రిటీల నుంచి కూడా శ్రావ్య వర్మకు విపరీతమైన మద్దతు లభిస్తోంది. షోలో విజేతగా నిలిచే అన్ని అర్హతలు ఆమెకు ఉన్నాయని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. తన అద్భుతమైన ఆటతీరుతో ‘ది ట్రెయిటర్స్’ షో స్థాయిని మరింత పెంచేసిన శ్రావ్య వర్మ, రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























