ప్రేమికుడు.. రీ రిలీజ్‌కి సిద్ధం, ఎప్పుడంటే?

Prabhu Deva's Premikudu Ready For Worldwide Grand Re Release

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఈ లిస్టు లోకి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సినిమా చేరింది. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ ‘ప్రేమికుడు’ సినిమా త్వరలో రీ-రిలీజ్ అవబోతోంది. 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలో ఘనంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1994 సెప్టెంబర్ 17న రిలీజైన ప్రేమికుడు మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ కేటి. కుంజుమోన్ నిర్మించారు. ఇక ఈ మూవీలో ప్రభుదేవా సరసన అందాల నటి నగ్మా కథానాయికగా నటించగా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ప్రభుదేవా తండ్రిగా ఎస్పీ బాలు గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ‘అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే’ పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్.పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. ‘టేకిట్ ఈజీ పాలసీ’, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ సాంగ్స్. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.