తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన మాటల చమక్కులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ-రిలీజ్ వేడుకలో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ సినిమా వెనుక ఉన్న ఎమోషన్ మరియు ప్రాముఖ్యతను వివరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“కుటుంబం అనేది మనం ఎంచుకునేది కాదు, మనకు ఇవ్వబడేది. బంధాలు మనకు ఇవ్వబడతాయి కానీ స్నేహితులను, ప్రేమను మనం ఎంచుకుంటాం. అలా ఇవ్వబడిన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక సామాన్యుడు తెగిస్తే ఏ స్థాయి వరకు వెళ్లగలడు అనేదే ఈ సినిమా కథ” అని త్రివిక్రమ్ వెల్లడించారు. కుటుంబ విలువలను, వాటి ప్రాముఖ్యతను తెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించడానికి వెంకటేష్ గారిని మించిన నటుడు లేరని ఆయన కొనియాడారు.
రచయితగా తన కెరీర్ ఆరంభంలో ‘పవిత్ర బంధం’, ‘నువ్వు నాకు నచ్చావ్’ సమయం నుంచే వెంకటేష్ గారు తనను ఎంతగానో ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు తమన్ అందించిన అద్భుతమైన రీ-రికార్డింగ్ సినిమాకు ఒక గోడలా నిలిచిందని ప్రశంసించారు. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను ఖచ్చితంగా గెలుచుకుంటుందని త్రివిక్రమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























