యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’. అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా బయటకు వచ్చిన అప్డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఊహక అందేలా అత్యంత అద్భుతంగా వచ్చిందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో గ్రాఫిక్స్ మరియు వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు సినిమా స్థాయిని పూర్తిగా మార్చేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ వాల్యూస్‌తో, ప్రతి ఫ్రేమ్‌ను అత్యంత రిచ్‌గా మలుస్తున్న టెక్నీషియన్ల పనితీరు ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తోంది. భారీ యుద్ద దృశ్యాలు, విజువల్ వండర్‌గా నిలిచే గ్రాఫిక్స్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయని స్పష్టమవుతోంది.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా, పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. వీఎఫ్ఎక్స్ పరంగా అంచనాలకు మించి అత్యద్భుతమైన అవుట్‌పుట్ వస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. త్వరలోనే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























