రాజావారు రాణిగారుతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరసగా రెండు సక్సెస్ ల చూసిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత నిరాశపరిచాడు.గత ఏడాది అయితే మూడు సినిమాలతో రాగ ఇందులో వినరో భాగ్యము విష్ణు కథ మాత్రమే డీసెంట్ హిట్ అనిపించుకుంది.మిగిలిన రెండు సినిమాలు మీటర్,రూల్స్ రంజన్ నిరాశపరచడంతో లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు.అయితే వరస ప్లాప్ లు తగలడంతో ఈసారి రూట్ మార్చాడు కిరణ్ అబ్బవరం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెగ్యులర్ స్టోరీస్ కాకుండా డిఫ్రెంట్ కంటెంట్ తో రానున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం కిరణ్…క అనే సినిమా చేస్తున్నాడు.టైటిల్ ఆసక్తిని క్రియేట్ చేయగా రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దాంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్ గా కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ రానుంది.రేపు ఉదయం 10:05 గంటలకు ఈసాంగ్ ప్రోమోను విడుదలచేయనుండగా ఈనెల 19న ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది.
సుజిత్ ,సందీప్ తెరకెక్కిస్తున్న ఈసినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నాడు.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.ఈసినిమా తెలుగుతో పాటు హిందీ ,కన్నడ ,మలయాళ,తమిళ భాషల్లో కూడా విడుదలకానుంది.కిరణ్ కు ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ.మరి ఈసినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























