కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో జరగబోయే వేడుకకు దేశవ్యాప్తంగా వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఆహ్వానం అందింది. ఈ మేరకు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిథులు ఆయనకు ఆహ్వానపత్రం అందించారు.
ఇక వారి ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన మెగాస్టార్ బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ నాలుగు సంస్థల పెద్దలతో ముచ్చటించి వారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే, దాదాపు నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్, బాలయ్య టాలీవుడ్ లో అగ్ర కథానాయకులుగా వెలుగొందుతోన్న సంగతి తెలిసిందే.
కాగా చిరంజీవిని కలిసినవారిలో.. భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, రాజా రవీంద్ర, జెమినీ కిరణ్, కె.ఎల్. నారాయణ, మాదాల రవి, అనుపమ్ రెడ్డి, నిర్మాత సి. కళ్యాణ్, డైరెక్టర్ వీర శంకర్, నిర్మాత అశోక్ కుమార్, అనిల్ వల్లభనేని, వీర శంకర్ తదితరులు వున్నారు.
ఇక ఇప్పటివరకూ 108 చిత్రాల్లో నటించిన బాలకృష్ణ ప్రస్తుతం 109వ సినిమాలో నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: