ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.ఇక ఎట్టకేలకు ఈరోజు ట్రైలర్ ను విడుదలచేశారు.ఈ ట్రైలర్ సినిమా అంచనాలకు తగ్గట్లే వుంది.యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ లో విజువల్స్,స్టంట్స్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే గోట్ వెంకట్ ప్రభు మార్క్ ఎంటర్టైనర్ గా వస్తుందనిపిస్తుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.ఇందులోస్నేహ,మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించగా ప్రశాంత్, ప్రభుదేవా,అజ్మల్, లైలా,యోగిబాబు,వీటీవీ గణేష్, జయరామ్ కీలక పాత్రల్లో పోషించారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.తెలుగులో ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ విడుదలచేస్తుంది.
ఇక ఈసినిమా తరువాత విజయ్ తన 69వ సినిమాను హెచ్ వినోత్ తో చేయనున్నాడు.ఈవిషయాన్ని రీసెంట్ గా ఈ డైరెక్టరే ఓ ఈవెంట్ లో వెల్లడించాడు.అయితే ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండదని కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానుందని వినోత్ తెలిపాడు.ఈసినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మాత్రం ది గోట్ రిలీజ్ తరువాతే రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: