జవాన్ కు సెన్సేషనల్ బుకింగ్స్

sensational advance bookings for jawan movie

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్,కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జవాన్.మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో జవాన్ అదరగొడుతుంది.హిందీ తోపాటు తెలుగు ,తమిళ భాషల్లో విడుదలవుతున్నా బుకింగ్స్ విషయంలో మాత్రం హిందీ వెర్షన్ సెన్సేషన్ క్రీయేట్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటివరకు ఈసినిమాకు బుక్ మై షో లో అన్ని భాషల్లో కలిపి 620k పైగా టికెట్స్ బుక్ అయ్యాయి.రానున్న మూడు రోజుల్లో 1 మిలియన్ మార్క్ ను చేరుకోనుంది.విడుదలకు ముందే ఈరేంజ్  అడ్వాన్స్ బుకింగ్స్ అంటే మామలు విషయం కాదు. ఇక హిట్ టాక్ వస్తే షారుక్ కు జవాన్ రూపం లో మరో 1000కోట్ల సినిమా పడనుంది.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో నయన తార హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి,దీపికా పదుకోణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.అనిరుధ్ రవి చందర్ సంగీతం అందించగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై గౌరీ ఖాన్ నిర్మించింది.ఇక ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ తో వచ్చి 1000కోట్ల వసూళ్లతో స్ట్రాంగ్ గా కం బ్యాక్ ఇచ్చిన షారుక్, జవాన్ తో ఆ ఫామ్ ను కొనసాగిస్తాడో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.