హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది. ‘సీన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అందరూ సూర్య గారిని హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అడుగుతున్నారు. నేను కూడా తోటి ఫ్యాన్‌గా అదే అడుగుతున్నాను. కచ్చితంగా హిట్ కొట్టాలి. అభిమానులుగా మీ అందరం ప్రామిస్ చేస్తున్నాం.. ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుంది. ఆయన ఈ ఏడాది మూడో సినిమాతో వస్తున్నారు. మరో రెండు సినిమాలు ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఇంకో సినిమా స్టార్ట్ కాబోతోంది. ఆయన ఎందుకంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే, ఆయనకు సినిమా అంటే ఇష్టం. సంవత్సరంలో 365 రోజులు ఆయన సినిమా కోసమే పనిచేస్తారు. మనం సూర్య గారికి సెల్యూట్ చెప్పాలి. ఈ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























