హిట్ 2 మ్యాక్స్ కన్నుమూత- శేష్ ఎమోషనల్ పోస్ట్

adivi sesh emotional post on hit 2 dog max death

శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా హిట్2 ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. ఈసినిమా హిట్ 1 సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో అడివి శేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇక ఈసీక్వెల్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించగా.. నాని సొంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా విషాదకరమైన సంఘటన చేసుకుంది. ఈసినిమాలో మ్యాక్స్ అనే ట్రైనింగ్ డాగ్ నటించిన సంగతి తెెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆ డాగ్ చనిపోయింది. ఈనేపథ్యంలో అడివిశేష్ ఈవిషయం చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. హిట్ 2లో నటించిన మ్యాక్స్ చనిపోయింది.. టిక్ ఫీవర్ వల్ల సాషా కన్నుమూసిందన్న విషయాన్ని మీకు చెప్పడానికి బాధ పడుతున్నాను. ఈ డాగ్ హిట్ 2 మూవీలో మ్యాక్స్ పాత్రను చేసింది. మేము ఆస్పత్రిలో తనను చూసినప్పుడు కోలుకుంటుందని అనుకున్నాము. కానీ, చివరకు పరిస్థితి విషమించి కన్నుమూసింది అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. గత ఏడాది మేజర్, హిట్ 2 అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అడివి శేష్. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గూఢచారి2 సీక్వెల్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.