మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెట్ సినిమాల్లో బ్రో సినిమా కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుంది కాబట్టి ఈసినిమాకు అంత క్రేజ్ ఏర్పడింది. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు ఈసినిమా రీమేక్. అక్కడ కూడా ఈసినిమాను సముద్రఖనే దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటికే మై డియర్ మార్కండేయ అనే పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈపాట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. నెరజానవులే అంటూ వచ్చే ఈ సెకండ్ సాంగ్ ను జులై 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా ఈసాంగ్ రిలీజ్ వేదికను ఖరారు చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈపాటను తిరుపతిలోని ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్ లో మధ్యాహ్నం 1 గంటకు రిలీజ్ చేయనున్నారు.
Tick, tock, love is about to rock ❤️#Jaanavule – #BroTheAvatar 2nd Single Grand Launch tomorrow 📣
📍NVR JAYASYAM THEATRE, TIRUPATI.
Join from 1PM ⏰#BROFromJuly28th @PawanKalyan @IamSaiDharamTej @TheKetikaSharma @thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla… pic.twitter.com/1NsjbjVDWx— Telugu FilmNagar (@telugufilmnagar) July 14, 2023
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































