తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘కర’ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు UA సర్టిఫికేట్‌ను జారీ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధనుష్ కెరీర్లో 54వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా నిడివి 2 గంటల 41 నిమిషాలు గా సెట్ చేశారు.ఈ చిత్రంలో ధనుష్ పాత్ర మునుపెన్నడూ లేని విధంగా చాలా రా గా మరియు పవర్‌ఫుల్‌గా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ‘కుబేరా’ తర్వాత ధనుష్ నుండి వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ కావడంతో దీనిపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
మమితా బైజు ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. విఘ్నేష్ రాజా తన మొదటి సినిమా ‘పోరల్’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు, కాబట్టి ఈ సినిమా మేకింగ్ మరియు స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. జి.వి. ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న తమిళంతో పాటు మిగితా భాషల్లో విడుదలకానుంది. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























