ధర్మన్‌లో రజినీకి జోడిగా నయనతార

Nayanthara Joins Rajinikanth in Dharman

సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ధర్మన్’. లోకనాయకుడు కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తుండటంతో మొదటి నుంచీ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ ఒక బిగ్ అప్‌డేట్ ఇస్తూ, లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రజనీకాంత్ మరియు నయనతార కాంబినేషన్‌లో వస్తున్న ఆరో చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించగా, మరోసారి ఈ హిట్ పెయిర్ వెండితెరపై సందడి చేయబోతుండటంతో ప్రాజెక్ట్ రేంజ్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో రామ్ పోతినేని, శ్రీలీల, రాశీ ఖన్నా, సిమ్రన్ మరియు యోగిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో మెరవనున్నారు.

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండటం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భారీ నిర్మాణ విలువలతో, మల్టీస్టారర్ కాస్టింగ్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సెన్సేషనల్ కాంబినేషన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.