నాట్స్ ఈవెంట్‌లో పుష్ప డైలాగ్స్‌తో అదరగొట్టిన అల్లు అర్జున్

Icon Star Allu Arjun Speech With Pushpa Style Dialogues in NATS 2025

ఇండియన్స్ ఎక్కడున్నా తగ్గేదేలే..! అని, అందులోనూ తెలుగు వాళ్లంటే అస్సలు తగ్గేదేలే..! అని పేర్కొన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అమెరికాలోని టంపా నగరంలో NATS (North America Telugu Society) 2025 వేడుకలు అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ ఈవెంట్‌లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు పాల్గొన్నారు. వీరిలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్స్ కె. రాఘవేంద్రరావు, సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా వేదికపై ఐకాన్ స్టార్ తన మార్క్ డైలాగులతో ఆహుతులను అలరించారు. ‘‘తెలుగోళ్లంటే ఫైర్ అనుకున్నారా..? వైల్డ్ ఫైర్..!, నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్..!, ఇండియన్స్ ఎక్కడున్నా తగ్గేదేలే..! అందులో తెలుగువాళ్లయితే అస్సలు తగ్గేదేలే..!’’, వంటి పుష్ప స్టైల్ డైలాగ్స్‌తో అదరగొట్టారు. అలాగే, యాంకర్ శ్రీముఖిని ఉద్దేశించి.. ‘మీ యాంకరింగ్‌ మాత్రం రప్పా రప్పా!’’ అంటూ ప్రశంసించారు. దీంతో ఆడియెన్స్ ఈలలు, చప్పట్లతో ఆడిటోరియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది.

ఇక ఇదిలావుంటే, అల్లు అర్జున్ ప్ర‌స్తుతం తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయన సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె క‌థానాయిక‌గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ సహకారం అందించనున్నారు. సుమారు రూ. 800 కోట్లతో ఇది తెరకెక్కుతున్నట్టు టాక్. కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ వెల్లడి కానున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.