సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ అవైటెడ్ మూవీ కూలీపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 700కోట్ల బిజినెస్ చేసింది.తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా మొదటి పాట చీకిటు రిలీజ్ అయ్యింది.అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఈసినిమా ఆడియో పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అయితే చీకిటు మాత్రం అనుకున్నంతగా చార్ట్ బస్టర్ కాలేకపోయింది.ఇక ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రానుంది.ఈవారంలో రిలీజ్ కానుంది.మరి ఈ సాంగైనా అంచనాలను అందుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర , సత్య రాజ్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరవనున్నాడు.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కూలీ 1000 కోట్ల సినిమా కానుంది.అదే జరిగితే ఈసినిమా కోలీవుడ్ మొదటి 1000 కోట్ల సినిమాగా రికార్డు సృష్టించనుంది.
భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.అయితే అదే రోజున హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 కూడా థియేటర్లలోకి వస్తుండడంతో తెలుగు,హిందీలో కూలీకి భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























