టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మూవీ ‘లక్కీ భాస్కర్’. బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గతేడాది విడుదలై 100కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సూపర్ హిట్ మూవీకి త్వరలో సీక్వెల్ రానుందా? ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్టు చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్‌కి తప్పకుండా సీక్వెల్ ఉంటుందని, ఆ కథలో ఆ అవకాశం ఉందని అన్నారు. అలాగే లక్కీ భాస్కర్ తర్వాత పలువురు నిర్మాతలు బయోపిక్స్ చేయాలని తనని సంప్రదించారని చెప్పారు. అయితే తనకు వాటిపై ఇంట్రెస్ట్ లేదని స్పష్టం చేశారు.
ఎందుకంటే, తనకు థ్రిల్లర్, పీరియాడిక్ తరహా చిత్రాలపై ఆసక్తి ఉండదని. కుటుంబం అంతా కలిసి కూర్చొని చూసే అందమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ రూపొందించాలని ఉంటుందని చెప్పారు. ఇప్పుడు అలాంటి సినిమానే చేస్తున్నట్టు తెలిపారు. కాగా వెంకీ అట్లూరి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో మమితా బైజూ కథానాయికగా నటిస్తోంది.
సో.. ఈ మూవీ తర్వాత లక్కీ భాస్కర్ సీక్వెల్ మొదలయ్యే అవకాశముంది. కాగా లక్కీ భాస్కర్ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా.. అయేషా ఖాన్, సాయి కుమార్, సచిన్ ఖేడ్కర్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు. జి. వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























