టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వకీల్ సాబ్ ఫేమ్ శ్రీ రామ్ వేణు తెరకెక్కించిన సినిమా తమ్ముడు.నితిన్ ఇందులో హీరోగా నటించగా సప్తమి గౌడ హీరోయిన్ గా చేసింది.ఈసినిమాతో లయ రీ ఎంట్రీ ఇస్తుంది.జులై 4న తమ్ముడు విడుదలకానుంది.ఇక నిన్న ఈసినిమా ట్రైలర్ ను వదిలారు.ఈసందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహించారు.ఇందులో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్ని రోజుల నుండో నేను ఒక విషయం చెప్పాలనుకున్నా.ఈరోజు చెప్పాల్సిందే.యూట్యూబ్ లో ట్రైలర్ రిలీజ్ చేశాం.దానికి వచ్చే వ్యూస్ ఉంటాయి కదా అవ్వని ఒరిజినల్.ప్రేక్షకులు చూస్తున్న నంబర్లే అక్కడ ఉండాలని మిలియన్స్ వ్యూస్ కొనద్దని మా టీంకి చెప్పా.ఎందుకంటే ఒరిజినల్ గా సాంగ్ కానీ ట్రైలర్ కానీ ఎంత రీచ్ అవుతుందో తెలిస్తే సినిమా ఎంత రీచ్ అవుతుందో అర్థమవుతుంది.కొనడం వల్ల అక్కడ నెంబర్ కనిపిస్తుంది కానీ సినిమా రీచ్ తెలియదు.అందుకే కష్టమైన నేనే మొదటి స్టెప్ తీసుకున్నా.కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు వచ్చి చూస్తారు లేకపోతే వల్లే రిజెక్ట్ చేస్తారు.ఇందులో మనం చేసేది ఏమి లేదు.అలాగే కలెక్షన్స్ విషయంలో యూఎస్ లో వున్న బాక్సాఫీస్ ట్రాకింగ్ రన్ ట్రాక్ పద్దతి తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలి.త్వరలోనే అది కూడా వస్తుంది.దాంతో సినిమా జెన్యూన్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో తెలుస్తుంది.
ఇక తమ్ముడు విషయంలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ ,హీరో నితిన్ చాలా సపోర్ట్ చేశారు.వేణు ఈసినిమా కోసం నాలుగేళ్లు కష్టపడ్డాడు.ఒక రోజు సినిమా ఆలస్యం అవుతుంది కదా రెవెన్యూ పరంగా మళ్లీ నాకు డబ్బులు రిటర్న్ రావాలి కదా అని వేణుని అడిగితే సార్ ఇప్పటివరకు నేను డబ్బులు డ్రా చేసా రేపటి నుండి ఒక్క రూపాయి కూడా డ్రా చేయను.సినిమా హిట్ అయ్యాక మీరే ఇవ్వండి అని అన్నాడు.అలాగే నితిన్ కి పరిస్థితి ని వివరిస్తే మీరు ఎంత పంపించాలనుకుంటే అంతే పంపించండి తరువాత చూసుకుందాం అని సపోర్ట్ చేశారు.అంటే ఒక దిల్ రాజు కే హీరో ,డైరెక్టర్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత అవసరమనేది అందరూ ఆలోచన చేయాలంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: