ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు త్వరలో కలవనున్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను వీరు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నారు. తద్వారా ఏపీ ప్రభుత్వ సహకారంతో ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. కాగా ఈనెల 15న సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు భేటీ కానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు వారు విజయవాడ సమీపంలోని ఉండవల్లి నివాసంలో ఈ ఆదివారం సాయంత్రం 4 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవనున్నారు. కాగా ఇటీవలే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా.. చిత్ర పరిశ్రమ తరపున ఎవరూ ప్రభుత్వ పెద్దలను కలవడానికి రాలేదని ఆయన బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ ప్రముఖులు సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కలవబోతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























