గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా, టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న లాటెట్స్ మూవీ ‘ది ఇండియా హౌస్’. ప్రస్తుతం హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలో వేసిన సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా ఈ మూవీ సెట్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఘటనలో యూనిట్ లోని పలువురికి గాయాలయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్‌లో భాగంగా సముద్ర సన్నివేశాల కోసం ఓ భారీ వాటర్ ట్యాంకర్‌ని తెప్పించారు. అయితే చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఈ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో లొకేషన్ మొత్తం నీటమునిగింది. అయితే అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం సంభవించనప్పటికీ, ఈ ప్రమాదంలో ఒక అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలు కాగా, మరికొంత మంది సిబ్బంది గాయపడ్డట్లు తెలుస్తోంది.
గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటన సమయంలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ సెట్‌లో ఉన్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: