ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘తమ్ముడు’. సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, ‘యానిమల్’ ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే ఈ చిత్రం నుంచి ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరుతో గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. జులై 4న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ్ముడు థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు. ఇందులో లయ, నితిన్ మధ్య అక్క-తమ్ముడు బాండింగ్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అక్క ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం యుద్దానికి సైతం సిద్దపడే తమ్ముడిగా నితిన్ కనిపించాడు.
అలాగే సప్తమి గౌడ, స్వశిక విజయ్ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. ఇక చాలా రోజుల తర్వాత నితిన్ మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ చేసినట్టు అర్ధమవుతోంది. ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయితే లేడీస్ ఆడియెన్స్ థియేటర్లకు బారులుతీరే అవకాశముంది. దర్శకుడు సెంటిమెంట్‌తో పాటు యాక్షన్‌కూ పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో వున్నాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగావుంది. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసేలావుంది.
ఇక ఇటీవల వచ్చిన ‘రాబిన్‌హుడ్’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తమ్ముడు చిత్రంతో అయినా ఈసారి సాలిడ్ హిట్ అందుకోవాలనే కసితో వున్నాడు నితిన్. దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వస్తోన్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు భారీగానే వున్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద సోలోగా రానుండటం కూడా నితిన్‌కి కలిసిరానుంది. మరోవైపు నితిన్ దీనితర్వాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎల్లమ్మ’లో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రానికి ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దీనికి దర్శకత్వం వహించనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: