తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 45వ సినిమాలో నటిస్తున్నాడు.ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.షూటింగ్ కూడా సగానికి పైగా కంప్లీట్ అయ్యింది.అయితే ఈసినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాకు వెట్టై కరుప్పు అనే టైటిల్ ను పెట్టినట్లు గా ప్రచారం జరుగుతుంది.మరి ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారో లేదో మరి కొద్దీ రోజుల్లో క్లారిటీ రానుంది. ఈసినిమాలో స్వాసికా ,కాళీ వెంకట్ ,నటరాజన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక సూర్య నెక్స్ట్ తన 46వ సినిమాను తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తో చేయనున్నాడు.త్వరలోనే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.
ఇదిలావుంటే రీసెంట్ గా సూర్య రెట్రోతో ప్రేక్షకులముందుకు రాగ తమిళంలో డీసెంట్ హిట్ అనిపించుకుంది. తెలుగులో మాత్రం అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.కార్తీక్ సుబ్బరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా పూజా హెగ్డే కథానాయికగా నటించింది.సూర్య సొంత బ్యానర్ 2 డి ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈనెల చివర్లో ఓటిటిలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: