మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదలకానుంది. ప్రస్తుతం ఇది నిర్మాణదశలో వుంది. అయితే అప్పుడే ఆయన మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. చిరు హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 22నుండి షూటింగ్ మొదలవబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి, చిరంజీవి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘రౌడీ అల్లుడు’ టైప్ స్టోరీని సిద్ధం చేశాడట. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా నుండి షూటింగ్ స్టార్ట్ కాకముందే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది చిత్ర యూనిట్.
ఈ చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్ కథానాయికగా నటించనుంది. అదెవరంటే.. లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ మేరకు మేకర్స్ తాజాగా అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా నయనతార ఇంతకుముందు చిరంజీవితో కలిసి సూపర్ హిట్ ఫిల్మ్ ‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ చిత్రాల్లో నటించిన సంగతి గుర్తుండేవుంటుంది. ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్ట్ కోసం చిరు, నయనతార కలిసి పనిచేయనుండటం ఆసక్తి కలిగిస్తోంది.
అలాగే ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో నయనతార తన టీంతో తెలుగులో మాట్లాడటం, కారు ప్రయాణంలో చిరంజీవి క్లాసిక్ పాటలు వినడం, స్క్రిప్ట్‌ను చదవడం, చిరు ఐకానిక్ డైలాగ్‌లలో ఒకదాన్ని చెప్పడం ఆకట్టుకుంది. ఫైనల్‌గా, అనిల్ రావిపూడి ఆమెతో కలిసి న్యూస్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడిదీ ఒక్కో శైలి. తక్కువ సమయంలో సినిమాను ఫినిష్ చేయడంలో అనిల్ దిట్ట. ఈ ఏడాది పొంగల్ కానుకగా వచ్చి సాలిడ్ హిట్ అందుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని అనిల్ కేవలం 75రోజుల్లో పూర్తి చేయడం విశేషం. ఆ లెక్కన ఈ ఏడాది చివరి కల్లా చిరు సినిమాను పూర్తి చేసే అవకాశముంది. ఇక దీని తర్వాత మెగాస్టార్ ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: