చిన్న సినిమాగా వచ్చి ఈఏడాది కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది టూరిస్ట్ ఫ్యామిలీ.మౌత్ టాక్ తో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూపోతుంది ఈసినిమా. నిన్నటి వరకు తమిళనాడులో 40కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం తో బయ్యర్ల పాలిట జాక్ పాట్ లా మారింది.సూర్య నటించిన రెట్రో కూడా స్లో అవ్వడంతో టూరిస్ట్ ఫ్యామిలీ హవా కొనసాగిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే నిన్నటి తో ఈసినిమా 60కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఫుల్ రన్ లో మరో 20కోట్ల వరకు రాబట్టుకునే ఛాన్స్ వుంది.కేవలం ఈసినిమా తమిళంలో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కావడంతో ఇతర భాషల రైట్స్ కు అలాగే ఓటిటి రైట్స్ కు డిమాండ్ పెరిగింది.
ఇక ఈసినిమాను కేవలం 35 రోజుల్లోనే పూర్తి చేశారు.బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో ప్రముఖ నటుడు శశి కుమార్ ,సిమ్రాన్ ,మిథున్ జై శంకర్ ,కమలేష్,యోగ లక్ష్మి లీడ్ రోల్ లో నటించగా అభిషన్ జీవింత్ డైరెక్ట్ చేశాడు.సీన్ రోనాల్డ్ సంగీతం అందించాడు. మిలియన్ డాలర్ స్టూడియోస్ ,ఎమ్ ఆర్ పి ఎంటర్టైన్మెంట్ నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: