రామ్ చరణ్, ఎన్టీఆర్ బాండింగ్‌కు ఆడియెన్స్ ఫిదా

Ram Charan and NTR Brotherhood Bonding Surprises Audience at RRR Live Music Event

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత బెస్ట్ ఫ్రెండ్సో అందరికీ తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా వారి స్నేహం కొనసాగుతోంది. అభిమానుల మధ్య వైరుధ్యాలున్నా ఈ ఇద్దరు స్టార్స్ మాత్రం ప్రాణ స్నేహితులుగా ఉంటూ ఫ్యాన్స్‌కే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో తొలిసారిగా వీరి ఫ్రెండ్‌షిప్’ బాహ్య ప్రపంచానికి పరిచయమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాటినుంచి నేటివరకూ అనేక బహిరంగ వేదికలపై వారి ఆత్మీయత ఇరువురి అభిమానుకు కన్నులపండుగగా వుంటోంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి వీరు తమ స్నేహ బంధంతో ఆడియెన్స్‌ని మురిపించారు. ఈ మేరకు లండన్ లోని ప్ర‌ఖ్యాత రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్ దీనికి వేదికయింది. ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ మరియు నేషనల్ అవార్డ్స్ విన్నర్ కీర‌వాణి ఆధ్వర్యంలో ‘ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్స‌ర్ట్’ జరిగింది.

ఆదివారం రాత్రి ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ మరియు నేషనల్ అవార్డ్స్ విన్నర్ కీర‌వాణి ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగగా.. ఈ కార్యక్రమానికి ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళితో పాటు హీరోలు జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ హ‌జ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీర‌వాణి అక్క‌డి రాయల్‌ ఫిల్‌ హార్మోనిక్‌ కాన్సర్ట్‌ ఆర్కెస్ట్రాతో క‌లిసి అద్భుత‌ ప్రదర్శన ఇచ్చి ఆహుతుల‌ను మెస్మ‌రైజ్ చేశారు.

ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ ను ఆలింగ‌నం చేసుకుని, ప్రేమగా ముద్దాడారు. అలాగే తారక్ కి ముంద‌స్తు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు కూడా తెలిపారు. ఎన్టీఆర్ జన్మదినం మే 20 అన్న సంగతి తెలిసిందే. ఈ చర్య ఈ ఇద్దరు స్టార్ హీరోల బాండింగ్‌ను మ‌రోసారి ప్ర‌పంచానికి తెలియ‌జేసింది. ఇక ఈ దృశ్యం ఆహూతులను క‌ట్టి ప‌డేసింది. వీరి బాండింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

మరోవైపు నిర్వాహకులు ఈ ఇద్దరు క‌లిసి ఉన్న ఫొటోల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించి అక్క‌డికి వ‌చ్చిన వారిని సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఆడిటోరియం అంతా ఒక్కసారిగా ఈల‌లు, చ‌ప్ప‌ట్ల‌తో ద‌ద్ద‌రిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన పొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్‌ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతున్నాయి. ఇక ఈ సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరితో ‘ఆర్ఆర్ఆర్ 2’ చేయాల్సిందిగా డైరెక్టర్ రాజమౌళికి ఆడియెన్స్ నుంచి విజ్ఞప్తులు అందడం గమనార్హం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.