విశ్వక్ సేన్ ‘కల్ట్’ షూటింగ్ స్టార్ట్

Mass Ka Das Vishwak Sen's Third Directorial CULT Shoot Begins

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా పరిశ్రమలో తన వెర్సటాలిటీని నిరూపించుకుంటున్నారు. నటనతో మాత్రమే పరిమితం కాకుండా, ఇప్పటికే ‘ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ’ సినిమాలతో దర్శకుడు, నిర్మాత, రచయితగా తన ప్రతిభను చాటారు. ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ #CULT (కల్ట్) కోసం సిద్ధమవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాను తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్ బ్యానర్లపై కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విశ్వక్ సేన్ దర్శకుడిగానే కాదు కథ కూడా స్వయంగా రాసుకున్నారు. ఇది మరొక ప్రత్యేకమైన క్రియేటివ్ జర్నీ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కల్ట్ చిత్రం తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి కోర్ టీమ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎస్ రాధాకృష్ణ (చిన్నబాబు) టైటిల్ లోగోను లాంచ్ చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ముహూర్తపు షాట్‌కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ప్రారంభోత్సవంతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా నేడు ప్రారంభమైంది.

ఇక న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్‌గా, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న #CULT ట్రెడిషనల్ ఫార్ములాలను చెరిపేసేలా ఉంది. ఈ సినిమా పోస్టర్‌లో గోట్ మాస్క్ ధరించిన ప్రొటగనిస్ట్, వైబ్రెంట్ బ్యాక్ డ్రాప్, కంటైనర్లు కనిపించాయి. ఇవి సినిమా యూనిక్ నెస్ ని సూచిస్తున్నాయి. ఈ సినిమా ఆడియన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.

ఈ సినిమాలో విశ్వక్సేన్ 40 మంది కొత్త నటులను పరిచయం చేస్తున్నారు. ఆయన విజన్ కి మద్దతు ఇస్తూ అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్‌ను అందించగా, KGF, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. అర్వింద్ విష్వనాథన్ సినిమాటోగ్రఫీ, రవి తేజ గిరిజాల ఎడిటింగ్‌, అర్వింద్ ములే ఆర్ట్ డైరెక్షన్‌ను నిర్వహిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.