తెలుగు చిత్రసీమలో విశిష్ట ఘనత కలిగిన ‘నందమూరి’ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, దివంగత లెజెండరీ నటుడు శ్రీ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడైన యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ కోసం వైవిఎస్ చౌదరి కొత్త బ్యానర్ ప్రకటించడం విశేషం. ఇప్పటికే ఆయన ‘బొమ్మరిల్లు వారి” అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. వీటిలో.. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, నిప్పు, రేయ్.. వంటి సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ‘న్యూ టాలెంట్ రోర్స్ @’ అనే బ్యానర్‌ను స్థాపించారు.
ఈ బ్యానర్‌లో చౌదరి సతీమణి యలమంచిలి గీత నిర్మాణ సారథ్యంలో తొలి సినిమాగా దీనిని నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి హీరో నందమూరి తారక రామారావు ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే దర్శకుడు వైవిఎస్ చౌదరి పరిచయం చేశారు. కాగా ఈ సినిమాలో కథానాయికగా తెలుగమ్మాయి వీణ రావు నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయింది.
అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, దివంగత ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి సహా నందమూరి కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు. భువనేశ్వరి క్లాప్ కొట్టి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించగా.. హీరో, హీరోయిన్లపై తొలిషాట్ చిత్రీకరించారు. మరోవైపు ఈ యంగ్ చాప్ టాలీవుడ్ ఎంట్రీపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండటం గమనార్హం. ఇంతకుముందు చౌదరి తీసిన పలు సినిమాలకు ఆయన చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. అలాగే ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ సినిమాకి సాహిత్యం అందిస్తుస్తుండగా.. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.
అయితే ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న విషయం విదితమే. అలాగే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా త్వరలో అరగేంట్రం చేయబోతున్నాడు. ఈ క్రమంలో అదే ఫ్యామిలీ నుండి ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: