మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ విష్ణు సింగిల్ కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా సెన్సేషనల్ వీకెండ్ రన్ తో బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతుంది.మౌత్ టాక్ బాగుండడంతో మొదటి రోజు కన్నా రెండో రోజు, మూడో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 16.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఫస్ట్ నుండి ఈసినిమా కు అన్ని కలిసొచ్చాయి.పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం అలాగే ఐపీఎల్ మ్యాచ్ లు రద్దు కావడంతో ఫస్ట్ ,సెకండ్ షోస్ కి ఆక్యుపెన్సీ పెరుగుతూ వచ్చింది.
ఇక అటు నార్త్ అమెరికాలోనూ ఈసినిమా బ్లాక్ బస్టర్ దిశగా సాగుతుంది.ఇప్పటివరకు హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.ఫుల్ రన్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరేలానే వుంది.ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఈసినిమా 30 కోట్ల వరకు రాబట్టుకోనుంది.ఈనెల లో పెద్ద సినిమాలు విడుదలకాకపోతుండడంతో సింగిల్ కు అడ్వాంటేజ్ కానుంది.కేవలం యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్సు నుండి కూడా సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈసినిమాలో కేతికా శర్మ ,ఇవానా హీరోయిన్లు గా నటించగా వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించాడు.శ్రీ విష్ణు ,వెన్నెల కిషోర్ ల కామెడీ సినిమాలో హైలైట్ అయ్యింది.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ ,కళ్యా ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: