సుధీర్ బాబు సర్వైవల్ యాక్షన్ డ్రామా అనౌన్స్‌మెంట్

Nawa Dalapathy Sudheer Babu New Survival Action Drama Announced

కంటెంట్ బేస్డ్ సినిమాలు, భారీ స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్స్ రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన క్రేజీ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నవదళపతి సుధీర్ బాబు హీరోగా తమ 51వ ప్రొడక్షన్‌ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి RS నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. “#PMFxSB” చిత్రాన్ని విజినరీ నిర్మాతలు TG విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైవిద్యమైన పాత్రలను ఎంచుకోవడంలో మంచి పేరు తెచ్చుకున్న సుధీర్ బాబు, ప్రతిసారి కొత్తదనం కోసం వినూత్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే ధోరణిలో ఈ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా అధికారికంగా సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ అయితే అదిరిపోయింది.

ఇందులో సుధీర్ బాబు షర్ట్ లెస్‌గా, సాలిడ్ ఫిజిక్ తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. మెట్లపై మృతదేహాలు పడిపోతుండగా, ఆయన ఒక చేతిలో ఆయుధాన్ని పట్టుకుని పైకెత్తుతూ కనిపించడం చాలా క్యూరియాసిటీని పెంచింది. #PMFxSB సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందించబడుతోంది. పోస్టర్‌లోనే ఉత్కంఠను పెంచుతూ, ఇంటెన్స్ మూడ్‌ను సెట్ చేసింది. “A Broken Soul On A Brutal Celebration” అనే ట్యాగ్‌లైన్ సుధీర్ బాబు క్యారెక్టర్ డెప్త్‌ని తెలియజేస్తోంది.

ఇక ఈ పాత్ర కోసం మరోసారి సుధీర్ బాబు తన ఫిజిక్‌ని మేకోవర్ చేస్తూ, కండలు తిరిగిన మాచో లుక్‌లో మారిపోయారు. బలమైన యాక్షన్ పాత్ర కోసం ఆయన బీస్ట్ మోడ్‌లోకి వెళ్ళారు. కాగా ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, పనిచేయనున్న టెక్నీషియన్స్ డీటెయిల్స్ మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.