జాట్ 2 రానుంది

Mythri Movie Makers Announces Sequel For JAAT

బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జాట్’. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై తొలినుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ హిందీ చిత్రం ఘనవిజయం సాధించింది. నార్త్ హీరోను సౌత్ డైరెక్టర్ చూపించిన తీరుకి హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొనే సమస్యలతో రూపొందిన జాట్ సినిమా అక్కడివారిని బాగా ఆకట్టుకుంది. దీంతో సన్నీడియోల్ ‘గదర్’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

ఈ క్రమంలో తాజాగా మేకర్స్ జాట్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్‌ చేశారు. ఇదే కాంబోలో జాట్ 2 రానున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటించారు. కాగా జాట్ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ చిత్రంలో సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటించగా.. బీటౌన్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా విలన్‌ పాత్రను పోషించాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ మరో కీలక పాత్రలో కనిపించగా.. స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్ ఎస్‌ థమన్ సంగీతం అందించగా.. రిషి పంజాబి సినిమాటోగ్రఫర్‌గా, అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వర్క్‌ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.