ఓదెల 2 తాండవం మొదలైంది, సునామీగా మారబోతోంది

Director Sampath Nandi Thanks Audience For Odela 2 Success

తమన్నా భాటియా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఓదెల 2. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం తమన్నా నాగ సాధువుగా అదరగొట్టారు. వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న విడుదలైన ఓదెల 2 అన్నిచోట్లా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సక్సెస్ ప్రెస్ మీట్‌లో మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. “మేము ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్‌కి థాంక్యూ. మేము ఆశించిన రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది. తమన్నా నాగ సాధువుగా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై చాలా అంచనాల ఏర్పడ్డాయి. తన పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి హైలైట్‌గా ఉండబోతుందని మేము ముందే చెప్పాము. అది ఈరోజు ఆడియన్స్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది.”

“తమన్నా వశిష్ట సింహ మధ్య పోటాపోటీ పెర్ఫార్మన్స్ ఉంటుందని చెప్పాము. అది ఈరోజు ఆడియన్స్ విట్నెస్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా లేడీస్‌తో ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఈరోజు ఒక ప్రీమియర్ లాగా మొదలైంది. శుక్రవారం నుంచి ఈ సినిమా సునామీ మొదలు కాబోతుంది. శివశక్తిగా తమన్నా చేసే అసలైన రచ్చ శుక్రవారం నుంచి మొదలు కాబోతుంది. ఈ వారాంతం మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి ఈ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు.”

“ఈ సినిమాలో సైకిల్ ఎపిసోడ్, క్లైమాక్స్‌లో వచ్చే రెండు సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్, అలాగే మరికొన్ని సీక్వెన్సెస్ మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేయబోతున్నాయి. ఒక మంచి ఎక్స్‌రియన్స్‌తో థియేటర్స్ నుంచి బయటికి రండి. ఈ సినిమాకి చాలా సక్సెస్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌కి థాంక్స్ చెప్పాలని ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సినిమాని దీవించిన శివునికి, ప్రేక్షక దేవుళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.