మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ లేకుండానే ఈ షెడ్యూల్ జరిగింది.ఇక సెకండ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు.ఈనెల 22న ఎన్టీఆర్ సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు.ఈషెడ్యూల్ దాదాపు 3వారాల పాటు బ్రేక్ లేకుండా జరుగనుందట.ఇందులో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.సినిమాలో ఈసీక్వెన్స్ హైలైట్ అవ్వనుందట.ప్రస్తుతం సినిమాకోసం ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అన్ని కుదిరితే అక్టోబర్ లోపు షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.ఈసినిమాకి ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయాల్సివుంది.ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.జనవరి 9న రిలీజ్ చేస్తామని అనౌన్స్ మెంట్ రోజే చెప్పేశారు.మరి ఆ డేట్ కి వస్తుందో లేదో చూడాలి.
ఇక ఈసినిమా కన్నా ముందు ఎన్టీఆర్,వార్ 2తో రానున్నాడు.అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.ఇంకో పాట మినహా షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యింది.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న హిందీ తోపాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.ఈసినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: