హిట్ 3 ట్రైలర్ కు సెన్సేషనల్ వ్యూస్

Hit 3 trailer gets record-breaking views on YouTube

హ్యాట్రిక్ విజయాలతో పీక్ ఫామ్ లో వున్న నేచురల్ స్టార్ నాని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా హిట్ 3.హిట్ 2 కి సీక్వెల్ గా వస్తుంది.దీనికి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈసినిమా నుండి రీసెంట్ గా టీజర్, సాంగ్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక నిన్న ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.ఈట్రైలర్ సెన్సేషనల్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫుల్ వైలెన్స్ తో వచ్చిన ఈ ట్రైలర్ 24 గంటల్లోనే సింగిల్ లాంగ్వాజ్ లో 21.35 మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో కొనసాగుతుంది.నాని సినిమాల్లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ .హిట్ 3 పాన్ ఇండియా రిలీజ్ కానున్నడంతో ఈరోజు హిందీ వెర్షన్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.ఓవరాల్ గా ట్రైలర్ తో హిట్ 3 అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇక ఈసినిమా ఏ సర్టిఫికెట్ తో థియేటర్లలోకి రానుంది.నాని కెరీర్ లో ఇదే మొదటి ఏ రేటెడ్ సినిమా.అయితే ఫ్యామిలీ ప్రేక్షకుల్లో నానికి మంచి ఇమేజ్ వుంది.కానీ ఈసారి వారికి సెట్ అయ్యే కంటెంట్ తో రావడం లేదు.మరి ఈసినిమా ఎలాంటి రన్ ను కనబరుస్తుందో చూడాలి.

హిట్ 3 ని శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.నానితో కలిసి ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.మే 1న హిట్ 3 థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.