నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది 3rd కేస్’. శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ సిరీస్‌లో మూడో సినిమాగా రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో నాని టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ’ అనే మెలోడీ సాంగ్ విడుదలచేసిన చిత్రయూనిట్.. రీసెంట్ గా ‘అబ్ కి బార్.. అర్జున్ సర్కార్’ అనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా నేడు హిట్ 3 థియేట్రికల్ ట్రైలర్ విడుదలచేసింది చిత్ర బృందం.
ట్రైలర్ అయితే అదిరిపోయింది. ప్రముఖ ప్రవచనకారులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రసంగం బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా.. హీరో నాని ఎలివేషన్ గూంజ్ బంప్స్ తెప్పించే విధంగా నెక్స్ట్ లెవెల్లో వుంది. అర్జున్ సర్కార్ పాత్రలో నాని ఇరగదీశాడు. కరడుగట్టిన పోలీస్ అధికారిగా ఆ క్యారక్టర్ తాలూకూ క్రూరత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. తను తప్పితే మరొకరిని ఈ పాత్రలో ఊహించుకోలేం అన్నంతగా నటించేశాడు. “జనాల మధ్యలో ఉంటే అర్జున్.. మృగాల మధ్యలో ఉంటే సర్కార్” అని నాని చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
ఇక హిట్ 3 చిత్రానికి సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు. అలాగే కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ చేస్తుండగా.. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ని ఈ చిత్రం రిడిఫైన్ చేసిన ఆడియన్స్ కు నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. కాగా హిట్: ది 3rd కేస్ మే 1న థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: