తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ గత వారం రిలీజై సాలిడ్ వసూళ్లతో అదరగొడుతుంది. ముఖ్యంగా తమిళనాడులో సూపర్ రన్ ను కొనసాగిస్తోంది. నిన్న తమిళ న్యూ ఇయర్ సందర్భంగా హాలిడే కావడంతో సూపర్ వసూళ్లను రాబట్టింది.దాంతో అక్కడ 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.అజిత్ ఈ ఫీట్ సాధించడం ఇది నాలుగో సారి. గ్లోబల్ వైడ్ గా ఈసినిమా 5 రోజుల్లో 190 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈరోజు తో 200 కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.ఫుల్ రన్ లో 250కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.అదే జరిగితే అజిత్ కెరీర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులోకూడా విడుదలై డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది.అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో త్రిష కథానాయికగా నటించగా సునీల్ కీలక పాత్ర చేశాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.తమిళంలో వీరికి ఇదే మొదటి సినిమా కాగా సూపర్ హిట్ కొట్టి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
ఇక వరుస పరాజయాల తరువాత అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ తో కం బ్యాక్ ఇచ్చాడు. ఈసినిమా తరువాత అజిత్ ఇప్పటివరకు అయితే నెక్స్ట్ సినిమాను లాక్ చేయలేదు. అయితే గతంలో అజిత్ తో పలు సినిమాలు చేసిన డైరెక్టర్ శివ మరో సారి అజిత్ తో సినిమా చేయనున్నాడని టాక్.త్వరలోనే అజిత్ నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: