నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది 3rd కేస్’. శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ సిరీస్‌లో మూడో సినిమాగా రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పోస్టర్స్.. అన్నీ సూపర్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో మార్కెట్‌లో ఈ మూవీ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో నాని టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ’ అనే మెలోడీ సాంగ్ విడుదలచేసిన చిత్రయూనిట్.. తాజాగా సెకండ్ సింగిల్ గురించి అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా హిట్ 3 స్లోగన్ ‘అబ్ కి బార్ అర్జున్ సర్కార్’ పేరుతో దీనికి సంబంధించి ఒక వీడియో పంచుకుంది.
ఇక హిట్ 3 చిత్రానికి సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు. అలాగే కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ చేస్తుండగా.. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ని ఈ చిత్రం రిడిఫైన్ చేసిన ఆడియన్స్ కు నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. కాగా హిట్: ది 3rd కేస్ మే 1, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: