అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ చిత్రం వచ్చి రెండేళ్లు అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ తదుపరి చిత్రంకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ కొత్త సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు హిట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ మరియు మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. నేడు అఖిల్ జన్మదినం సందర్భంగా ఈ మూవీ టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి వీల్లడించారు మేకర్స్. కాగా ఈ సినిమాకి ‘లెనిన్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
కాగా ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీలీల కథానాయికగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎస్ తమన్ మ్యూజిక్ అందించనున్నట్టు సమాచారం. హీరో కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ తీసిన మురళి కిషోర్ అబ్బూరు దీనికి దర్శకత్వం వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ వార్తలకి సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సివుంది. ఇక త్వరలోనే ఈ చిత్రంలో నటించనున్న నటీనటులు, పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























