నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అర్జున్ S/O వైజయంతి’ ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ సహా అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుంది. రన్ టైమ్ కూడా లాక్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాన్ని అందించినందుకు సెన్సార్ అధికారులు టీంని ప్రశంసించారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్‌ని కూడా అభినందించారు. సినిమా 2 గంటల 24 నిమిషాల రన్ టైమ్‌తో యాక్షన్, ఎమోషన్, థ్రిల్స్ సమపాళ్లలో బ్లెండ్ చేస్తోంది. అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాలు, మనసుని కదిలించే మదర్ అండ్ సన్ డ్రామా.. ప్రతి క్షణం గ్రిప్పింగా ఉంటుందని హామీ ఇస్తుంది.
కళ్యాణ్ రామ్ బాధ్యతాయుతమైన కొడుకు పాత్రను పవర్ ఫుల్‌గా చిత్రీకరించడం, తల్లిగా విజయశాంతి కమాండింగ్ ప్రజెన్స్ ఎమోషన్స్‌ని మరింతగా పెంచుతుంది. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ సెకండ్ హాఫ్ తల్లి, కొడుకుల బాండింగ్, ఎమోషనల్ డెప్త్ హై-ఆక్టేన్ యాక్షన్‌తో బ్లెండ్ చేస్తుంది. క్లైమాక్స్ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వుంటుంది, ప్రేక్షకులు చివరి వరకు తమ సీట్ ఎడ్జ్‌లో ఉండేలా చేస్తుంది.
ప్రదీప్ చిలుకూరి సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. రామ్ ప్రసాద్ వండర్ ఫుల్ సినిమాటోగ్రఫీ, బి అజనీష్ లోక్‌నాథ్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ హైలెట్‌గా వుండబోతోంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సినిమాని అత్యున్నతంగా నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























